ఓటు వేయండి డెమోక్రసీని రక్షించండి.. గవర్నర్ తమిళిసై | vote to save democracy| governer| tamilisye| call| telangana
posted on Nov 30, 2023 12:48PM
తెలంగాణ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పిలుపు ఇచ్చారు. ప్రలోభాలకు లొంగ కుండా భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును సద్వినియోం చేసుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ డే న సెలవు ప్రకటించింది ఇంటి వద్ద కూర్చోవడానికి కాదనీ విలువైన ఓటును ఉపయోగించుకోవడానికేననీ పేర్కొన్న తమిళిసై జనం పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు పోటెత్తాలన్నారు.
పార్టీలు ముఖ్యం కాదని, కావాల్సిందల్లా చైతన్యవంతంతో కూడిన ఓటు అని గుర్తించాలని పేర్కొన్న గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. కనీసం 100 శాతం పొలింగ్ జరిగేలా జనం ముందుకు రావాలని ఆకాంక్షించారు.