posted on Nov 30, 2023 5:33PM
తెలంగాణలో ఈ సారి హంగ్ తప్పదని సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ 48 స్థానాలలోనూ, కాంగ్రెస్ 56 స్థానాలలోనూ విజయం సాధించే అవకాశాలున్నాయి. ఇక బీజేపీ పది స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఎంఐఎం 5 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి.
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ 48 నుంచి 64 స్థానాలలో విజయం సాధించే అవకాశాలుండగా, అధికార బీఆర్ఎస్ 40 నుంచి 55 స్థానాలలో గెలుపొందే అవకాశాలున్నాయి. బీజేపీకి 7 నుంచి 13 స్థానాలలో విజయావకాశాలున్నాయి. అలాగే ఎంఐఎంకు 4 నుంచి 7 స్థానాలలో గెలుపు సాధించే అవకాశాలు ఉన్నాయి. లు