Leading News Portal in Telugu

మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 36. 68శాతం పోలింగ్ | more than 36 percent votes poll till one oclock| medak


posted on Nov 30, 2023 1:21PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చెదురుమదురు ఘటనలు వినా పోలింగ్ ప్రశాతంగా కొనసాగుతోందని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంటున్నది. మధ్యహ్నం ఒంటి గంట సమయానికి 36.68శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో అత్యల్పంగా 20.79 శాతం పోలింగ్ జరగగా, మెదక్ జిల్లాలో అత్యధికంగా 50.80శాతం పోలింగ్ నమోదైంది.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది.  అదిలాబాద్ 41.88, భద్రాద్రి 39.29, హనుమకొండ 35.29,  హైద్రాబాద్ 20.79 శాతం పోలింగ్ నమోదు కాగా.. జగిత్యాలలో 46.14,  జనగాం 44.31, భూపాలపల్లి 49.12,  గద్వాల్ 49.29శాతం చొప్పున పోలింగ్ జరిగింది.

అలాగే కామరెడ్డి 40.78, కరీంనగర్ 40.73,  ఖమ్మం 42.93, ఆసిఫాబాద్ 42.77,  మహబూబాబాద్ 46.89,  మహబూబ్ నగర్ 44.93 శాతం పోలింగ్ జరిగింది. ఇక మంచిర్యాలలో 42.74, మెదక్ లో 50.80 శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే మేడ్చల్ 26.70,  ములుగు 45.69,  నాగర కర్నూల్ 39.58, నల్గొండ 39.20 శాతం పోలింగ్ జరిగింది. ఇక నారాయణ పేటలో నారాయణపేట 42.60శాతం, నిర్మల్ లో 41.74 శాతం చొప్పున పోలింగ్ జరిగింది. ఇక పోతే నిజామాబాద్ లో 39.66, సిరిసిల్లలో 39.07, పెద్దపల్లి 44.49 శాతం చొప్పున పోలింగ్ జరిగింది. అలాగే రంగారెడ్డి 29.79, సంగారెడ్డి 42.17, 

సిద్దిపేట 44.35, సూర్యాపేట 44.14 శాతం ఓట్లు నమోదయ్యాయి.  అలాగే వికారాబాద్ 44.85, వనపర్తి 40.40, వరంగల్ 37.25,యాదాద్రి 45.07 శాతం చొప్పున ఓట్లు పోలయ్యాయి.