Leading News Portal in Telugu

Rajasthan: రాజస్థాన్‌లో కమల వికాసం.. అధికారం కోల్పోనున్న గెహ్లాట్.?


Rajasthan: రాజస్థాన్‌లో కమల వికాసం.. అధికారం కోల్పోనున్న గెహ్లాట్.?

Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలవుతారని రెండు ఎగ్జిట్ పోల్స్ అంచానా వేశాయి. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. అయితే రాజస్థాన్ చరిత్రను పరిశీలిస్తే ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోలేదు. మరోసారి ఇదే సాంప్రదాయాన్ని రాజస్థాన్ ఓటర్లు పునరావృతం చేయనున్నారు.

జన్ కీ బాతో పోల్ ప్రకారం.. బీజేపీ 100 నుంచి 122 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేయగా.. కాంగ్రెస్ 62-82 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది. టీవీ9 భారత్ వర్ష్-పోల్‌స్టాట్ ప్రకారం.. బీజేపీకి 100-110 విజయాన్ని సాధిస్తుందని, కాంగ్రెస్ 90-100 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉండగా, మెజారిటీ మార్క్ 101.