
10 Killed In Iraq Bomb Attack: ఇరాక్‌లోని దియాలా ప్రావిన్స్‌లో గురువారం బాంబు దాడి జరిగింది. స్థానిక ఎంపీ బంధువులపై జరిగిన ఈ దాడిలో పది మంది మృతి చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గురువారం సాయంత్రం ఎంపీ బంధువులు ప్రయాణిస్తున్న వాహనం అమ్రానియా ప్రాంతానికి చేరుకోగానే.. కొందరు దుండగులు నాటు బాంబులతో వాహనంపై దాడి చేశారు. అనంతరం తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో 10 మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో కర్ఫ్యూ విధించి దుండగుల కోసం గాలిస్తున్నారు.