Leading News Portal in Telugu

Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత… మోహరించిన ఏపీ, తెలంగాణ పోలీసులు..


Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత… మోహరించిన ఏపీ, తెలంగాణ పోలీసులు..

Nagarjuna Sagar Dam: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం పై ఉద్రిక్తత కొనసాగుతుంది. దీంతో ఏపీ, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి నుండి టెన్షన్ కొనసాగుతుంది. నిన్న ఏపీ బలవంతంగా కుడి కాలువ నుండి 2వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసుకున్నారు. తాగునీటి కోసమే నీటి విడుదల చేసుకున్నట్లు ఏపీ ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే కృష్ణ రివర్ బోర్డ్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. పలనాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి నాగార్జునసాగర్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో డ్యాం వద్ద ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

Read also: Chandrababu: నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం..

నిన్న రాత్రి ఏపీ పోలీసులు మెయిన్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించి 13 గేట్ల వరకు బారికేడ్లు, ఇనుప కంచెలు వేశారు. ప్రాజెక్టు అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏపీ అధికారులు 5వ గేటు నుంచి కుడి కాల్వలోకి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో గురువారం ఉదయం నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఓటింగ్ ప్రక్రియలో ఏపీ తీరు చర్చనీయాంశంగా మారింది. ఏపీ కుడి కాలువ నుంచి కేవలం తాగునీటి అవసరాలకే నీటిని విడుదల చేశామన్నారు. ఓటింగ్ ముగియడంతో తెలంగాణ పోలీసు బలగాలు పెద్దఎత్తున డ్యాం వద్దకు చేరుకుంటున్నాయి. అవసరమైతే జేసీబీతో ఇనుప కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

Read also: Animal Twitter Review : దుమ్ము దులిపేసిన రణబీర్..సినిమా ఎలా ఉందంటే?

ఆంధ్రప్రదేశ్ విభజనతో నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం రాజుకుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. కానీ ఏపీ అధికారులు మాత్రం తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తోందని… తమ వాటా నీటి వాటా కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. దీంతో పాటు పోలీసుల సాయంతో సాగర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి ఏపీ పోలీసులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇరిగేషన్ అధికారులు మాట్లాడి ఈ వివాదాన్ని పరిష్కరిస్తారని… ముళ్ల కంచెను తొలగించి వెనక్కి వెళ్లాలని ఏపీ పోలీసులకు సూచించారు. అయినా ఏపీ పోలీసులు స్పందించకపోవడంతో ఉద్రిక్తత కొనసాగింది.
Karthika Friday: ఈ స్తోత్రాలు వింటే సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు