Leading News Portal in Telugu

Flipkart offers: ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్..ఆ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్..


Flipkart offers: ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్..ఆ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్..

మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభం అయ్యింది.. నిన్నటి నుంచి ఈ సేల్ ప్రారంభం కాగా, డిసెంబర్ 6 వరకు ఈ ఆఫర్స్ కొనసాగానున్నాయి.. ఈ సందర్భంగా నథింగ్ ఫోన్ (2), శామ్‌సంగ్ గెలాక్సీ M14, పోకో X5 ప్రో వంటి మోడళ్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను అందిస్తోంది. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఒక లుక్ వేద్దాం పదండీ..

రెడ్‌మీ 12C..

ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారు తాజా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లలో రెడ్‌మీ 12C ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. పోర్టల్‌లో ఈ డివైజ్ రూ. 6,799కి లిస్ట్ అయింది.

శామ్‌సంగ్ గెలాక్సీ M14..

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ M14 అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇది రూ.15,000లో బెస్ట్ ఫోన్‌గా నిలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ.13,399కి లిస్ట్ అయింది. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డుతో మరో 10 శాతం అదనంగా తగ్గింపు ఉంటుంది..

నథింగ్ ఫోన్ (2)..

నథింగ్ ఫోన్ (2)ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.39,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ 5G డివైజ్ ఈ సంవత్సరం ప్రారంభంలో రూ. 44,999కి లాంచ్ అయింది. అంటే ప్రస్తుతం నథింగ్ ఫోన్ (2)పై ఏకంగా రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది.. కొన్ని బ్యాంకులతో కొనుగోలు చేస్తే అదనంగా భారీ తగ్గింపు ఉంది..

పోకో X5 ప్రో..

తాజా ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ పోకో X5 ప్రో మోడల్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ భారతదేశంలో రూ.22,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో దీని ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం పోకో X5 ప్రో ఫోన్ రూ.18,999కి అందుబాటులో ఉంది. అంటే కస్టమ్లు రూ. 4,000 డిస్కౌంట్ పొందవచ్చు..

మోటొరోలా ఎడ్జ్ 40..

మోటొరోలా ఎడ్జ్ 40 ఒక మిడ్‌రేంజ్ ఫోన్. ఇది రూ.30,000 లోపు లభిస్తున్న బెస్ట్ 5G ఫోన్‌లలో ఒకటి. తాజా ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ దీన్ని రూ.26,999కి అందిస్తోంది. మోటొరోలా ఎడ్జ్ 40 అసలు ధర రూ.29,999 కాగా, ప్రస్తుతం రూ.3వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చెయ్యొచ్చు.. త్వరపడండి..