Leading News Portal in Telugu

Ayodhya Ram Temple: అయోధ్య రామమందిర శంకుస్థాపన.. 6000 మంది అతిథులకు ఆహ్వానం


Ayodhya Ram Temple: అయోధ్య రామమందిర శంకుస్థాపన.. 6000 మంది అతిథులకు ఆహ్వానం

Ayodhya Ram Temple: అయోధ్య రామమందిర శంకస్థాపన కోసం వడివడిగా పనులు జరుగుతున్నాయి. 2024 జనవరి 22న రామమందిర ప్రతిష్టాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ చేతులు మీదుగా శ్రీరామ విగ్రహం ప్రతిష్టాపన జరగనుంది. ఇప్పటికే అయోధ్య ఆలయ ట్రస్ట్ ప్రధాని మోదీకి ఆహ్వాన పత్రిక అందించింది.

దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న శ్రీరామ ఆలయ శంకుస్థాపన కోసం దేశవ్యాప్తంగా 6000 మంది అతిథులకు ఆహ్వాన పత్రికలు పంపనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పూజారులు, సాధువులే కాకుండా, ప్రధాని మోడీతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్‌తో సహా రాజకీయ ప్రముఖులు జనవరి 22న ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2024లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలతో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహిస్తుందని ఒక అధికారి తెలిపారు. జనవరి 14 నుంచి 22 వరకు పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి.

అయోధ్య వివాదంపై 2019లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆలయ నిర్మాణం కోసం ‘శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్’ని ఏర్పాటు చేసింది. 2020 ఆగస్టు 5న మోదీ ఆలయానికి శంకుస్థాపన చేసిన తర్వాత నిర్మాణం ప్రారంభమైంది. 1988లో అహ్మదాబాద్ లోని సోంపురా కుటుంబం రూపొందించిన డిజైన్ పై ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.