Leading News Portal in Telugu

Shirdi Sai Baba Temple: షిర్డీ సాయిబాబా భక్తులకు గుడ్‌న్యూస్‌ చేప్పిన ట్రస్ట్ బోర్డు


Shirdi Sai Baba Temple: షిర్డీ సాయిబాబా భక్తులకు గుడ్‌న్యూస్‌ చేప్పిన ట్రస్ట్ బోర్డు

షిర్డీ సాయిబాబా టెంపుల్ ట్రస్ట్ బోర్డు సభ్యులు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలోని బంగారు, వెండి నిల్వలను కరిగించి నాణేలు తయారు చేసి భక్తులకు విక్రయించాలని నిర్ణయించింది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందట. కాగా దేశంలోని ప్రముఖ ఆలాయాల్లో షిర్డీ సాయిబాబు టెంపుల్ ఒకటి. షిర్డీకి బాబాకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం వచ్చి బాబాను దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా షిర్డీ సాయికి భారీగా విరాళాలు ఇస్తుంటారు. కొందమంది భక్తులు నగదుతో పాటు బంగారం, వెండి కానుకలను సమర్పించుకున్నారు.

భక్తులు ఇప్పటి వరకు సమర్పించిన కానుకల్లో 450 కిలోలు బంగారం, 6వేల కిలోల వరకు వెండి హుండీల్లో వచ్చి చేరింది. ఈ క్రమంలో షిర్డీ సాయిబాబా దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు బంగారం, వెండిని కరిగించి పతకాలు, నాణేలను తయారు చేయించి.. వాటిని విక్రయించాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తుల్జాపూర్‌ భవానీ దేవస్థానం కూడా పరిశీలించి.. షిర్డీ ట్రస్ట్‌ సభ్యులతో సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురు బోర్డు సభ్యులు మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చిన కానుకల్లో 450 కిలోల బంగారం, 6వేల వరకు వెండి ఉందని, ఇందులో 155 కిలోల బంగారం.. 6వేల కిలోల వెండిని కరిగించి.. 5, 10 గ్రాముల నాణెలు, పతకాలను తయారు చేయించాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరామని, అనుమతులు వస్తే పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.