Leading News Portal in Telugu

MLA TJR Sudhakar Babu: నువ్వెంత.. నీ బతుకెంత?.. లోకేష్‌పై ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్


MLA TJR Sudhakar Babu: నువ్వెంత.. నీ బతుకెంత?.. లోకేష్‌పై ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్

MLA TJR Sudhakar Babu: టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లపై సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్‌ అయ్యారు. నువ్వెంత.. నీ బతుకెంత లోకేష్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిపై దూషణలా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడితే బుద్ధి చెబుతామన్నారు. సీఎంను తిట్టి నాయకుడివి అవ్వాలనుకుంటున్నావా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. వెన్నుపోటు వీరుడు-స్కిల్ దొంగ చంద్రబాబే కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు అని ఎన్నిసార్లు ప్రశ్నించినా లోకేష్ నుంచి సమాధానం లేదన్నారు. లోకేష్ మోకాళ్ళ యాత్ర చేసినా, పొర్లుదండాల యాత్ర చేసినా, పాక్కునే, దాక్కునే యాత్ర చేసిన ఫలితం ఏమీ ఉండదన్నారు. ముఖ్యమంత్రిపై లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

జగన్‌ను ఎందుకు ఓడించాలో పవన్ పది కారణాలు చెప్పాలన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తున్నందుకా?.. రైతు భరోసా ఇస్తున్నందుకా? అమ్మ ఒడి, చేయూత, ఆసరా.. ఇస్తున్నందుకా?.. ప్రజల్ని ఆదుకుంటున్నందుకా?.. గిట్టుబాటు ధరలు, బిడ్డలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నందుకా?.. ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. నువ్వు చేసే న్యాయం సినిమా ఇండస్ట్రీలో చెయ్ అంటూ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు పేర్కొన్నారు. మీ కుటుంబం అంతా సినీ ఇండస్ట్రీలో ఉన్నారుగా.. అక్కడ ఉన్న కార్మికుల్ని ఆదుకోవాలని సూచించారు. అన్ని కులాల వారిని రానివ్వండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.