Leading News Portal in Telugu

Pocharam Srinivas Reddy: ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎగ్జాట్ పోల్స్ వేరు..


Pocharam Srinivas Reddy: ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎగ్జాట్ పోల్స్ వేరు..

Pocharam Srinivas Reddy: ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎగ్జాట్ పోల్స్ వేరు.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కాబోతున్నారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎక్జాట్ పోల్స్ వేరు అన్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పార్టీలకు సంబంధాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఇస్తున్నారని తెలిపారు. పోలింగ్ పూర్తి కాకముందే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు. సైలెంట్ ఓటు కేసీఆర్ కు అనుకూలంగా ఉందన్నారు. బీఆర్ఎస్ 70 నుంచి 75 సీట్లు పక్క అని ధీమా వ్యక్తం చేశారు. మాస్ ఓటర్ వేరు.. క్లాస్ ఓటర్ వేరు అని అన్నారు. క్లాస్ ఓటర్ బీఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకీ వస్తే కేసీఆర్ పెద్ద పదవి ఇస్తా అన్నారని తెలిపారు. నా పక్కన ఉంటావు అన్నాడు కేసీఆర్ అని తెలిపారు. ఈ విషయం హరీష్ రావుకు కేటీఆర్ కు కూడా తెలియదన్నారు. మనసులో మాట కేసీఆర్ నాతో పంచుకున్నాడని తెలిపారు.

Read also: KA Paul: హైదరాబాద్ ప్రజలు నా మాట విన్నారు..

రేపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమతుంది. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఇక.. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. స్ట్రాంగ్‌ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు చేశారు. ఓ డీసీపీ స్థాయి అధికారి ఇద్దరు సీఐలు, నలుగులు ఎస్‌ఐలతో పాటు కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు పలు ఆంక్షలతో పాటు 144 సెక్షన్ విధించారు.
KA Paul: హైదరాబాద్ ప్రజలు నా మాట విన్నారు..