Leading News Portal in Telugu

కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా! | revanth reddy tweet on kodangal victory| revanth reddy won in kodangal| telangana election results| telangana results 2023| revanth reddy| telangana assembly 2023


posted on Dec 3, 2023 3:26PM

కొడంగల్ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 30 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు రేవంత్. “ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా. దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతా.” అని రాసుకొచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్.