
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతికి రానున్నారు. నేటి మధ్యాహ్నాం జనసేన పార్టీ విస్తృత స్థాయీ సమావేశంలో పవన్ పాల్గొననున్నారు. ఎన్నికలకు లీడర్లు, కేడరును సమాయత్తం చేస్తూ జనసేన ఈ సమావేశం నిర్వహిస్తుంది. క్షేత్ర స్థాయిలో టీడీపీతో సమన్వయం చేసుకునే అంశంపై జనసేన ప్రధానంగా చర్చ జరుపనుంది. ఈ నెల రెండో వారం నుంచి టీడీపీతో కలిసి వివిధ కార్యక్రమాల రూపకల్పనపై జనసేన ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది.
అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ఒంటరిగా పోటీ చేసేందుకు వైసీపీ రెడీ అవుతుండగా.. విపక్ష టీడీపీ, జనసేన పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. ఇక, ఏపీలో చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలవకుండా సీఎం జగన్ అడ్డుకునేందుకు ప్రయత్నించారని నారా లోకేష్ ఆరోపణలు చేశారు. యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్.. ఇవాళ చొల్లంగిపేట క్యాంప్ సైట్ నుంచి యువగళ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం రావడం ఖాయం.. వైసీపీ ప్రభుత్వం పెడుతున్న కేసులపై స్పందిస్తూ అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.