
Ashok Gehlot: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఆయన తన రాజీనామాను గవర్నర్‌కి అందించారు. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా నివాసానికి వెళ్లి రాజీనామా సమర్పించారు. మొత్తం 199 స్థానాలకు గానూ ఎన్నికలు జరగగా.. బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఏర్పడింది. కాంగ్రెస్ 70 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ ఓటమి ఖాయం కావడంతో గెహ్లాట్ సర్కార్ గద్దెదిగబోతోంది.
మరోవైపు బీజేపీ రాజస్థాన్‌తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయం సాధించింది. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ గ్యారెంటీలు ఓట్లను రాల్చలేదు. అక్కడి ప్రజలు ప్రతీసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగించారు. బీజేపీ గెలవడంతో వసుంధర రాజే, బాబా బాలక్‌నాథ్ వంటి వారు సీఎం రేసులో ఉన్నారు.