Leading News Portal in Telugu

Huge No Ball: ఇది నో బాల్ కాదు.. అంతకుమించి!


Huge No Ball: ఇది నో బాల్ కాదు.. అంతకుమించి!

Abhimanyu Mithun Stuns Cricket Fans With A Huge No-Ball: క్రికెట్‌లో ఏ బౌలర్‌ అయినా ‘నో బాల్’ వేస్తుంటాడు. క్రీజ్ వద్ద ఉండే ఫ్రంట్ లైన్‌ను బౌలర్ పాదం సగం కంటే ఎక్కువ ధాటితే.. అంపైర్ నో బాల్ ఇచ్చేస్తాడు. చాలా మంది బౌలింగ్ వేసేప్పుడు నియంత్రణ కోల్పోయి.. క్రీజ్ ఆవల అడుగు వేస్తుంటారు. అయితే బౌలర్ ఫుట్‌కు, క్రీజుకు మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. తాజాగా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అభిమన్యు మిథున్ మాత్రం భారీ నో బాల్ వేశాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా శనివారం చెన్నై బ్రేవ్స్‌, నార్తర్న్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో వారియర్స్‌ బౌలర్‌ అభిమన్యు మిథున్.. భారీ నో బాల్‌ను సంధించాడు. చెన్నై బ్రేవ్స్‌ ఇన్నింగ్స్‌ 5 ఓవర్‌లో మూడో బంతిని వేసే క్రమంలో మిథున్‌ ఓవర్‌ స్టేప్‌ చేశాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ నో బాల్‌గా ప్రకటించాడు. రిప్లేలో అభిమన్యు ఫుట్‌కు, క్రీజుకు మధ్య దూరం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. క్రీజు నుంచి 2 గజాల దూరంలో అభిమన్యు తన ఫుట్‌ను ల్యాండ్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్‌ చరిత్రలో ఇదే భారీ నో బాల్ అని కామెంట్లు చేస్తున్నారు.

గతంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ భారీ నో బాల్ వేసాడు. ఇంగ్లాండ్ జట్టుపై 2010లో జరిగిన లార్డ్స్ టెస్టులో స్పాట్ ఫిక్సింగ్ చేసి భారీ నో బాల్ వేసాడు. ప్రస్తుతం అభిమన్యు మిథున్ వేసిన నో బాల్ దీనికి గుర్తు చేస్తుంది. అభిమన్యు ఏమైనా ఫిక్సింగ్ చేశాడా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో నార్తర్న్ వారియర్స్ ఓడిపోయింది. 107 పరుగుల ఛేదనలో సికందర్ రజా 10 బంతుల్లో 27 పరుగులు చేసి చెన్నైను గెలిపించాడు.