Leading News Portal in Telugu

హైకమాండ్ కే సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయం | clp leader selection to high command| dk| shivkumar| press| meet| cm| aworn in| today


posted on Dec 4, 2023 12:42PM

కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎవరన్నది తేలలేదు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత పార్టీ హైకమాండ్ కే వదిలేస్తే సీఎల్పీ సమావేశం ఏక వాక్య తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా, తుమ్మల బలపరిచారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. 

సమావేశం ముగిసిన తరువాత కర్నాక డిప్యూటీ స్పీకర్ డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో ఏఐసీసీ పంపిన పరిశీలకులందరూ కూడా పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశం వివరాలు డీకే శివకుమార్ వివరించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టంగట్టిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ణతలు తెలియజేస్తా ఒక తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.

ఆ తరువాత సీఎల్పీ నేత ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలూ తీసుకున్న అనంతరంఆ ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసినట్లు డీకే మీడియాకు తెలిపారు. సమావేశ తీర్మానాన్ని హై కమాండ్ కు పంపామనీ, అక్కడ నుంచి వర్తమానం రాగానే ముఖ్యమంత్రి ఎవరన్నది ప్రకటిస్తామనీ వివరించారు. కాగా మీడియా సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు చేరుకుని ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను తెలియజేశారు. ఈ సాయంత్రం 6 గంటలలోగా తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్ భవన్ లో దాదాపు 300 మంది సమక్షంలో ఈ ప్రమీణ స్వీకారం జరిగే అవకాశం ఉంది.