Leading News Portal in Telugu

Money Earning: ఆవులు, గేదెలకు బదులు గాడిదల పెంపకం.. ప్రతినెలా రూ.3 లక్షల వరకు సంపాదన..!


Money Earning: ఆవులు, గేదెలకు బదులు గాడిదల పెంపకం.. ప్రతినెలా రూ.3 లక్షల వరకు సంపాదన..!

ఆవులు, గేదెల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులను మీరు చూసి ఉంటారు. అయితే అంతకుమించి డబ్బులు సంపాదిస్తున్నాడు ఓ రైతు. కానీ అది ఆవులు, గేదెల పెంపకంతో కాదు.. గాడిదల పెంపకంతో. గాడిదలను వస్తువులను తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ వీటి పెంపకం ద్వారా లక్షల్లో సంపాదించవచ్చు. ఎందుకంటే గాడిద పాలకు ప్రపంచంలో అత్యంత ఖరీదు ఉంది.

గుజరాత్‌లోని మనుంద్ అనే చిన్న గ్రామానికి చెందిన ధీరేన్ సోలంకి అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూశాడు. కానీ.. ఉద్యోగం రాకపోవడంతో గాడిదల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. సుమారు 8 నెలల క్రితం తన గ్రామంలో రూ.22 లక్షలతో కొద్దిపాటి భూమిని తీసుకుని 20 గాడిదలతో గాడిదల పెంపకం ప్రారంభించాడు. అయితే.. గుజరాత్‌లో గాడిద పాలకు ప్రాముఖ్యత లేకపోవడంతో ధీరేన్‌కు 5 నెలలు ఎలాంటి ఆదాయం రాలేదు. అయితే.. దక్షిణ భారతదేశంలో గాడిద పాలకు అత్యధిక డిమాండ్ ఉందని తెలుసుకుని.. ధీరేన్ దక్షిణ భారతదేశంలోని కొన్ని కంపెనీలను సంప్రదించాడు. ఆ తర్వాత క్రమంగా.. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలకు పాల సరఫరా చేయడం మొదలు పెట్టాడు.

Congress Meeting: మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి.. నేతలతో సోనియా గాంధీ సమావేశం

కాస్మోటిక్స్ కంపెనీలలో గాడిద పాలకు చాలా డిమాండ్ ఉంది. 1 లీటరు పాలను 5000 నుండి 7000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఈ పాలతో తయారు చేసిన పొడిని విదేశాల్లో రూ.లక్ష నుంచి 1.25 లక్షల వరకు విక్రయిస్తున్నారు. గాడిద పాలల్లో ప్రోటీన్, హైపోఅలెర్జెనిక్ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఆవు పాలతో పోల్చినట్లయితే, గాడిద పాలలో 9 రెట్లు ఎక్కువ టౌరిన్ ఉంటుంది. ఇది శిశువులలో పెరుగుదలను పెంచేందుకు తోడ్పడుతుంది. 19వ శతాబ్దంలో గాడిద పాలు పసిపిల్లలకు, అనారోగ్యంతో ఉన్న పిల్లలకు తాగించే వారు. కాగా.. యూరప్, ఆఫ్రికాలోని అనేక దేశాల్లో గాడిద పాలకు మంచి గుర్తింపు ఉంది. వీటిలో పోషకాలు అధికంగా ఉండటం వల్ల దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇవి.. ఆర్థరైటిస్, దగ్గు, శస్త్రచికిత్స గాయాలు, అల్సర్ మొదలైనవాటిని నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఫ్రాన్స్, ఇటలీలలో.. గాడిద పాలతో సబ్బును కూడా తయారు చేస్తారు.

కాగా.. ఇప్పుడు ధీరేన్ వద్ద 42 గాడిదలు ఉన్నాయి. వాటికి దాదాపు రూ.38 లక్షలు పెట్టుబడి పెట్టాడు. సగటున.. ఒక గాడిద 800 ml పాలు ఇస్తుంది. ధీరేన్ తన వ్యాపారాన్ని వెబ్‌సైట్ ద్వారా కూడా చేస్తున్నాడు. దీంతో అతను ప్రతి నెలా రూ.2 నుంచి 3 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.