Leading News Portal in Telugu

Cyclone Michaung: మిచౌంగ్‌ తుఫాన్ దెబ్బ.. గన్నవరం నుంచి విమానాలు రద్దు..


Cyclone Michaung: మిచౌంగ్‌ తుఫాన్ దెబ్బ.. గన్నవరం నుంచి విమానాలు రద్దు..

Cyclone Michaung: మిచౌంగ్‌ తుఫాన్‌ ముంచుకొస్తోంది. దక్షిణ కోస్తాను ముంచెత్తబోతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచౌంగ్ తీవ్ర తుఫాన్ వేగం తగ్గింది. ఇది చాలా ప్రమాదకరమని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తీవ్ర తుఫాన్‌.. ప్రస్తుతం గంటకు 10కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. నెల్లూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీవ్ర తుఫాన్ నెమ్మదిగా పయనిస్తే.. నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రెండు రోజులు చాలా కీలకమని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు, మీచౌంగ్ తుఫాన్ దెబ్బకి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానాలు రద్దు చేశారు.. ఇండిగో నుంచి నడిచే 14 విమానాలు రద్దు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.. విశాఖ, హైదరాబాద్‌, బెంగులూరు, షిర్డీలకు కనెక్టింగ్ ఫ్లైట్స్ రద్దు చేసినట్టు పేర్కొంది ఇండిగో.. మరో 4 విమానాల రాకపోకలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక, రేపు ఉదయం బాపట్ల-దివిసీమ మధ్య తీవ్ర తుఫాన్‌ తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. తీరం దాటిన తర్వాత కూడా తీవ్ర తుఫాన్‌ ప్రభావం కొనసాగుతుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని చోట్ల కుంభవృష్టి వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ నంబర్ 10 జారీ చేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కచ్చా ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉందని… విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలలు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు..