Lashkar Terrorist Shot Dead: పాకిస్థాన్‌లో భారత్ శత్రువుల నిర్మూలన కొనసాగుతోంది. కరాచీలో భారత్‌కు మరో పెద్ద శత్రువు హతమయ్యాడు. 2015లో జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడికి ప్లాన్ చేసిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది అద్నాన్ అహ్మద్ అలియాస్ హంజాలా అద్నాన్ హతమయ్యాడు. అతడిని గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు.
ఇండియా టుడే నివేదిక ప్రకారం.. డిసెంబర్ 2 అర్ధరాత్రి హంజాలా అద్నాన్‌ను గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. మొత్తం నాలుగు బుల్లెట్లు అతని శరీరంలోకి దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్‌కు అద్నాన్ అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.
అద్నాన్‌ను అతని ఇంటి బయట కాల్చి చంపారని, ఆ తర్వాత అతడిని పాకిస్థాన్ సైన్యం రహస్యంగా కరాచీలోని ఆసుపత్రికి తరలించిందని నివేదికలు చెబుతున్నాయి. అక్కడ అతను డిసెంబర్ 5 న మరణించాడు. ఉద్‌పూర్‌లో బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై లష్కర్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందడం గమనార్హం. 13 మంది బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు.