Leading News Portal in Telugu

AP High Court: విశాఖ హయగ్రీవ భూముల కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు


AP High Court: విశాఖ హయగ్రీవ భూముల కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: విశాఖ హయగ్రీవ భూములపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.. జిల్లా కలెక్టర్ భూ కేటాయింపు రద్దు పై ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో రెండు నెలలలో తెలియజేయాలని ఆదేశించింది న్యాయస్థానం.. అప్పటి వరకు హయగ్రీవ భూముల మీద ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు జరపకూడదని ఆదేశించింది హైకోర్టు.. విశాఖ ఎండాడలో అనాథులు, వృద్ధులకి కేటాయించిన 12.51 ఎకరాల హయగ్రీవ భూముల వివాదం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది.. దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్.. విచారణ జరిపిన హైకోర్టు.. ఇప్పుడు కీలక ఆదేశాలు జారీ చేసింది.. కాగా, విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి విశాఖ భూముల ధరలు పెరిగిపోయాయి.. ఇదే సమయంలో, వివాదస్పద భూముల సెటిల్మెంట్లు ఎక్కువయ్యాయని.. కొందరు నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తూ వుస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే హయగ్రీవ భూములపై వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లిన విషయం విదితమే.