
Pawan Kalyan: నేను అధికారం కోసం కాదు.. మార్పు కోసం ఓట్లు అడుగుతాను అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ పెట్టి ప్రజల రుణం తీర్చుకుంటున్నాను.. యువత భవిష్యత్ కోసం పోరాడుతుంటే అవమానాలు, వెటకారాలు చేస్తున్నారు.. అయినా వాటిని భరించడానికి సిద్ధం అన్నారు. ఉత్తరాంధ్ర చైతన్యం కలిగిన నేల, అటువంటి చోట నుంచి వలసలు ఆగాలి అని ఆకాక్షించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునే ప్రయత్నం జనసేన బలంగా చేస్తోందన్నారు. ప్రజలకు జవాబుదారీ తనం కూడా వహించడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా లేరన్న ఆయన.. యువతరం రాజకీయాలను నమ్మడం లేదన్నారు.
ఇక, సినిమాలు చేసి వందల కోట్లు సంపాదించుకుంటే స్వార్థపరుడిని అవుతాను.. అదే, రాజకీయాల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే 25 ఏళ్ల సేవ చేసినట్టే అన్నారు పవన్.. ఓటమి మీద ఓటమి ఎదురైన ఎక్కడా ఆగలేదు.. బీజేపీలో చేరితే నాకు కోరుకున్న పదవి ఇస్తారు.. అత్తరాంటికి దారేది అంటే మూడు గంటల్లో కథ చెప్పవొచ్చే.. అదే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏదీ అంటే జవాబు లేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో దోపిడీ జరుగుతుంటే నన్ను విమర్శించే నాయకులు ఎందుకు గుర్తించలేకపోయారు.. అని ప్రశ్నించారు. జేజేలు కొట్టి ఎనర్జీ వెస్ట్ చేసుకోకండి ఎన్నికల్లో బలంగా ఓటేయండి అని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆగి తీరాలి.. ఆంధ్రలో 29 బీసీ కులాలను తెలంగాణ గుర్తించడం లేదన్నారు. 151 మంది ఎమ్మెల్యేలును ఇస్తే ఒక్కసారి కూడా తెలంగాణ ప్రభుత్వంను ఎందుకు అడగలేదు.. ఎన్నికలప్పుడు పరస్పరం సహకరించుకునేప్పుడు ప్రజల ఇబ్బందులు ఎందుకు గుర్తుకు రావు అంటూ ప్రశ్నించారు పవన్ కల్యాణ్.