Leading News Portal in Telugu

Big Breaking: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల


Big Breaking: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల

Group-1 Notification Released in Andhrapradesh: నిరుద్యోగులకు ఏపీ సర్కారు మరో శుభవార్త చెప్పింది. గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను ఎపీపీఎస్సీ విడుదల చేసింది. ఏపీలో 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. డిప్యూటీ కలెక్టర్ 9, డీఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఇప్పటికే పలు రకాల పోస్టులకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తున్నారు.. అందులో కొన్ని భర్తీ కాగా.. మరికొన్ని ఫలితాల వరకు వచ్చాయి.. ఇదిలా ఉండగా.. గురువారంగ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ).. 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ రిలీజ్‌ చేశారు. గ్రూప్ -2 తాజా నోటిఫికేషన్‌ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566లు భర్తీ చేయనున్నారు.. ఇక, గ్రూప్‌ -2 పరీక్షలకు 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనుంది ఏపీపీఎస్సీ.. ఈ పరీక్షల కోసం 2023 డిసెంబర్ 21వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు ధరఖాస్తులను స్వీకరించనున్నారు.