
Nellore: పోలీసుల్ని చూస్తే దొంగలు భయంతో పారిపోతారు. అలాంటిది పోలీసు పైనే దాడి చేసి గాయపరిచాడు ఓ దొంగ.. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా లోని విడవలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ పై దొంగ దాడి చేశారు. కాగా పోలీసు పైన దాడి చేసిన దొంగ అల్లూరు మండలం సౌత్ మోపూరుకు చెందిన జాన్ వెస్లీ. ఇతను కొన్ని రోజుల క్రితం నెల్లూరు జిల్లా లోని ఊటుకూరు గ్రామంలో ద్విచక్ర వాహనం చోరీ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో అతన్ని పోలీస్ స్టేషన్ లో ఉంచారు.
Read also:Malavika Mohanan: శారీ అందాలతో మాయచేస్తున్న…మాళవిక మోహనన్
ఈ నేపథ్యంలో స్టేషన్ నుండి తప్పించుకునేందుకు జాన్ వెస్లీ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కస్టడీ నుండి పారిపోవాలని చూస్తున్న నిందితుడిని అడ్డుకునేందుకు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాసులు ప్రయత్నించాడు. దీనితో ఆ నిందితుడు కానిస్టేబుల్ శ్రీనివాసులు పైన దాడి చేసాడు. ఈ దాడిలో నిందితుడు కానిస్టేబుల్ శ్రీనివాసులు తల పైన రాడ్డుతో కొట్టాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శ్రీనివాసులు కు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రీనివాసులును గాయపరిచి పారిపోయే ప్రయత్నం చేసిన వెస్లీని సహచర సిబ్బంది పట్టుకున్నారు. అలానే గాయపడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలిసిన వాళ్ళు హతవిధీ ఇదెక్కడి విడ్డూరం పోలీసుల్ని దొంగ కొట్టడమేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు.