
Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ విచిత్రమైన పరిస్థితిని ఎదర్కొన్నారు. అధికార నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ బయట లాక్ అయ్యారు. నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే కూడా రిషి సునాక్‌తో కాసేపు బయటే ఉన్నారు. అక్కడ ఉన్న మీడియా అంతా ఫోటోలు, వీడియోలు తీశారు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్‌గా మారింది. రిషి సునాక్, డచ్ ప్రధాని మార్క్ రొట్టేను అధికార నివాసం వెలుపల స్వాగతిస్తూ, మీడియాకు ఫోటోగ్రాఫ్ ఇచ్చారు.
అయితే ఇద్దరు నేతలు బయట ఉండగానే, తలుపులు మూసుకుపోయాయి. రిషి సునాక్ డోర్ ఓపెన్ చేసుందుకు ప్రయత్నించడం, తన చేతులను డోర్‌పై ఉంచడం వీడియో చూడవచ్చు. డచ్ పీఎం రుట్టేని ఆహ్వానించేందుకు రిషి సునాక్ బయటకు వచ్చిన సమయంలో డోర్ లాక్ అయింది. ఆ తర్వాత తెరుచుకోలేదు. ఇద్దరూ కూడా డోర్ తెరుచుకుపోవడంతో కాసేపు అక్కడే ముచ్చటించారు. కొద్దిసేపు మెట్ల దగ్గరే తచ్చాడారు. రిషి సునాక్ డోర్ తెరిచేందుకు నెట్టేసిన కూడా ఫలితం లేకపోయింది. ఈ సంఘటనను అక్కడే ఉన్న మీడియా క్యాప్చర్ చేసింది. కాసేపటి తర్వాత లోపల నుంచి ఓ వ్యక్తి తలుపును తెలిచారు. అయితే సిబ్బందిలో ఎవరో ఒకరు పొరపాటున డోర్ పెట్టేయడంతో ఈ సమస్య ఎదురైనట్లు తెలిసింది.
ఇరువురు నేతలు ప్రపంచ పరిస్థితులు, వలస విధానం గురించి మాట్లాడారు. ముక్యంగా యూకే రువాండా విధానం, మిడిల్ ఈస్ట్‌లో పరిణామాలు, ఉక్రెయిన్ సంఘర్షణ, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
Awkward moment Rishi Sunak and Dutch prime minister Mark Rutte cannot get into 10 Downing Street
Daily Mail Onlinehttps://t.co/9OQWahQQ8g pic.twitter.com/fE2YzyYgci— DataMan (@Datamanone) December 7, 2023