Leading News Portal in Telugu

Balineni Srinivas Reddy: అందరూ హార్ట్ ఫుల్‌గా పనిచేస్తానంటేనే పోటీలో ఉంటా.. బాలినేని కీలక వ్యాఖ్యలు


Balineni Srinivas Reddy: అందరూ హార్ట్ ఫుల్‌గా పనిచేస్తానంటేనే పోటీలో ఉంటా.. బాలినేని కీలక వ్యాఖ్యలు

Balineni Srinivas Reddy: ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలు ఈసారి ఇరిటేషన్ తెప్పిస్తున్నాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన మీద, తన కుమారుడి మీద తరచూ అర్థం లేని ఆరోపణలు చేస్తూ బురద చల్లాలని చూడటం విసుగు తెప్పిస్తుందన్నారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి పరిస్దితులు చూడలేదన్నారు. ఏదైనా మాట్లాడితే బాధపడుతూ మాట్లాడుతున్నానని అంటున్నారని ఆయన అన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఓ కులం రోడ్డు మీదకు వచ్చి పనిచేస్తారు.. దీన్ని అందరం సమర్దవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలందరూ హార్ట్ ఫుల్‌గా పనిచేయాలన్నారు. తాను ఒంగోలు విడిచి మరోచోట పోటీ చేస్తానని చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్న ఆయన.. మరోసారి ఒంగోలు నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గత నెల రోజులుగా ఓటర్ లిస్టులు వెరిఫై చేయలని ఎన్నిసార్లు కార్యకర్తలను కోరినా ఇంతవరకూ సరిగా స్పందించలేదు.. ఇలాగైతే ఎన్నికల్లో పోటీ చేయటం కష్టమన్నారు. అందరూ హార్ట్ ఫుల్‌గా పనిచేస్తానంటేనే పోటీలో ఉంటానన్నారు. సీఎం జగన్‌కు కూడా ఒంగోలులో ఇళ్లపట్టాలు ఇవ్వలేక పోతే పోటీచేయనని చెప్పా.. అయితే ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం కాబట్టి ప్రస్తుతం ఆ సమస్య లేదన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశా.. కొత్తగా పోయేదేమీ లేదన్నారు.