Leading News Portal in Telugu

Bussiness Idea : మీ సొంత ఊరిలో ఉంటూ లక్షలు సంపాదించాలని అనుకుంటున్నారా?


Bussiness Idea : మీ సొంత ఊరిలో ఉంటూ లక్షలు సంపాదించాలని అనుకుంటున్నారా?

ఊర్లో ఉంటూనే బాగా సంపాదించాలని అందరు అనుకుంటారు.. ఇలా అయితే ఖర్చులు తక్కువ అని ఆలోచిస్తారు.. అలాంటి వారికోసం అదిరిపోయే బిజినెస్ ఇదే.. ఈ బిజినెస్ ఐడియా ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. ఇక మరి ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

పల్లెల్లో ఉండేవాళ్ళు ఉండే వాళ్ళు వ్యవసాయం ద్వారా డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. ఈ ఐడియా ద్వారా కూడా డబ్బులు వస్తాయి. జంతువులని పెంచే వాళ్ళు వాటి వ్యర్థాల ని క్యాష్ చేసుకోవచ్చు. జంతువుల పేడని ఉపయోగించి ఎరువులు తయారు చేయొచ్చు ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మార్కెట్లో పశుగ్రాసానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ మధ్య అయితే మరీ ఎక్కువ.. చాలా మంది గేదెలను కొనుగోలు చేస్తున్నారు.. దాంతో గడ్డికి మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ తగ్గలేదు..

ఇక సరఫరా లేకపోవడం వలన పశుగ్రాసం ధరలు పెరిగిపోయాయి. పశు గ్రాసం సంక్షోభం కూడా.. మీరు పశుగ్రాసాన్ని మార్కెట్లోకి తీసుకు వస్తే అప్పుడు డబ్బులు బాగా వస్తాయి. మామూలు బంజారా భూముల నుండి వచ్చే పశుగ్రాసం పోషక విలువలు తక్కువ కలిగి ఉంటుంది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పశువులు ఒకే చోట తింటే అక్కడ ఉన్న గడ్డి వేగంగా తరిగిపోతుంది పైగా త్వరగా పెరగదు కూడా. అత్యధిక దిగుబడినిచ్చే పశుగ్రాస రకాలను ఎంచుకుని సాగు చేసుకుంటే బాగా డబ్బులు వస్తాయి… ఇలా మీరు మీ ఊర్లో ఉంటూ మంచి ఆదాయాన్ని పొందుతూన్నారు.. మీకు ఇలా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చెయ్యండి..