Leading News Portal in Telugu

Alla Ramakrishna Reddy: బ్రేకింగ్‌: వైసీపీకి గుడ్‌పై.. ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా


Alla Ramakrishna Reddy: బ్రేకింగ్‌: వైసీపీకి గుడ్‌పై.. ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

Alla Ramakrishna Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా చేశారు.. ఎమ్మెల్యే పదవితో పాటు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కూడా రాజీనామా చేశారు.. మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్‌ ఆర్కే.. ప్రత్యర్థులపై కేసులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. అయితే, పార్టీకి గత కొంత కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు.. ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ వస్తున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు..

ఇదే సమయంలో.. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై కూడా ఆర్కే ఆవేదనతో ఉన్నట్టుగా ప్రచారం జరగుతోంది.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. రాజీనామా చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.. మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ.. బీసీలకు కేటాయిస్తుందనే ప్రచారం ఉన్న నేపథ్యంలో.. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారని చెబుతున్నారు. అయితే, తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నా.. పార్టీ నేతలు ఎవరూ తనను సంప్రదించడంలేదనే ఆవేదన ఆయనలో ఉందంట.. ఇదే సమయంలో.. మంగళగిరి వైసీపీ ఇంచార్జ్‌గా గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం నియమించడం.. నిన్న ప్రత్యేకంగా ఆయన పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.. ఈ కార్యక్రమానికి ఆర్కేకు ఆహ్వానం లేనట్టుగా తెలుస్తోంది.. ఇక, పార్టీలో కొనసాగడం కష్టమే నిర్ణయానికి వచ్చిన ఆయన.. పార్టీతో పాటు.. ఇదే సమయంలో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.. స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.