Leading News Portal in Telugu

AP High Court: గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కి హైకోర్టు షాక్‌, జైలు శిక్ష, జరిమానా విధింపు


AP High Court: గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కి హైకోర్టు షాక్‌, జైలు శిక్ష, జరిమానా విధింపు

AP High Court: గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు నెల రోజుల జైలు శిక్ష విధించింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరిచింది.. వచ్చే నెల జనవర 2వ తేదీ 2023న హైకోర్టు రిజిస్ట్రారు కార్యాలయంలో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.. గుంటూరు కొత్తపేటలో యడవల్లివారి సత్రం లీజు చెల్లింపులో హైకోర్టు ఆదేశాలు పాటించక పోవటంతో.. కోర్టు ధిక్కరణ కింద ఈ ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు. కాగా, గతంలోనూ సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు, మున్సిపల్‌ కమిషనర్లకు.. వివిధ కేసుల్లో కోర్టు ధిక్కరణకు పాల్పడితే.. హైకోర్టు జైలు శిక్షలు విధించిన విషయం విదితమే. ఇదే సమయంలో.. వారు హైకోర్టు ముందు హాజరై.. తమ తప్పును ఒప్పుకోవడంతో.. జైలు శిక్ష కాకుండా.. సాధాణ శిక్షలు అమలు చేసిన సందర్భాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న కీర్తి చేకూరి కూడా శిక్షతో పాటు జరిమానా విధించింది.. మరి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వేచిచూడాలి.