Leading News Portal in Telugu

Vivo X Series: అదిరిపోయే ఫీచర్స్ తో వివో కొత్త ఫోన్..ధర ఎంతంటే?


Vivo X Series: అదిరిపోయే ఫీచర్స్ తో వివో కొత్త ఫోన్..ధర ఎంతంటే?

ప్రముఖ చైనా కంపెనీ వివో కంపెనీ కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. ఇప్పుడు మరో అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. వివో x సిరీస్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. వివో ఎక్స్ 100 సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్‌ 100, వివో ఎక్స్‌ 100 ప్రో పేర్లతో రెండు ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్ గురించి, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫీచర్స్..

వీటిలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు.. 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 8టీ ఎల్టీపో కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఈ స్క్రీన్‌ సొంతం. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొచ్చారు.. అదే విధంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 120 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. చెన్ యీ బ్లాక్, స్టార్ ట్రయల్ బ్లూ, సన్ సెట్ ఆరేంజ్, వైట్ మూన్ లైట్ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది..

కెమెరా విషయానికొస్తే.. సెల్ఫీ ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. రెయిర్‌ కెమెరాను అందించారు. 64 మెగాపిక్సెల్ జీస్‌ పెరిస్కోప్‌ టెలిఫొటో కెమెరాను ఇవ్వనున్నారు. ఈ రెండు ఫోన్స్‌లోనూ 50 మెగపిక్సెల్‌ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను అందించారు.. ఇన్ని అద్భుతమైన ఫీచర్స్ ను కలిగిన ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. రూ. 45,000 కాగా వివో ఎక్స్‌ 100 ప్రో ధర రూ. 57,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే ఈ ఫోన్లకు ఫ్రీ సేల్ కూడా మొదలైందని వార్తలు కూడా నెట్టింట వినిపిస్తుంది..