Leading News Portal in Telugu

Tabraiz Shamsi Celebrations: వాళ్లు అడిగారనే షూతో సంబరాలు చేసుకున్నా: తంబ్రిజ్ షంసి


Tabraiz Shamsi Celebrations: వాళ్లు అడిగారనే షూతో సంబరాలు చేసుకున్నా: తంబ్రిజ్ షంసి

Tabraiz Shamsi Gives Clarity on Shoe-Phone Celebrations: గబేహా వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20లో భారత్‌పై దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో విజయం సాదించింది. ప్రొటీస్ విజయంలో రిజా హెండ్రిక్స్ (49; 27 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), ఐడెన్ మార్‌క్రమ్ (30; 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌)తో పాటు స్పిన్నర్ తంబ్రిజ్ షంసి కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన షంసి.. 18 పరుగులు ఇచ్చి కీలక సూర్యకుమార్‌ యాదవ్‌ను ఔట్‌ చేశాడు. దీంతో అతడికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. అవార్డు తీసుకున్న అనంతరం షంసి మాట్లాడుతూ షూతో ఫోన్‌ చేస్తున్నట్లు సంబరాలు చేసుకోవడానికి గల కారణంను వెల్లడించాడు.

‘వికెట్‌ తీసినప్పుడల్లా షూతో ఫోన్‌ చేస్తున్నట్లు సంబరాలు చేసుకోవడానికి దూరంగా ఉండానుకున్నా. అయితే నా పిల్లలు మాత్రం షూతో సంబరాలు చేయాలని అడుగుతూనే ఉన్నారు. వారిని నిరుత్సాహపరచకూడదని ఈ మ్యాచ్‌లో షూతో ఫోన్‌ చేస్తున్నట్లు సంబరాలు చేశా. వారు చాలా ఆనందంగా ఉంటారు’ అని దక్షిణాఫ్రికా స్పిన్నర్ తంబ్రిజ్ షంసి తెలిపాడు. వికెట్ పడినప్పుడల్లా కాలి షూ తీసేసి సంబరాలు చేసుకోవడం షంసికి అలవాటు. ఇటీవల ఆ సంబరాలకు షంసి దూరంగా ఉండగా.. తన పిల్లల కోరిక మేరకు మళ్లీ చేశాడు.

‘భారత్‌పై తీవ్ర ఒత్తిడిలో బౌలింగ్‌ చేసి రాణించడం ఆనందంగా ఉంది. సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతమైన ఆటగాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అతడిని ఈరోజు అడ్డుకోవడం సంతోషం. బౌలింగ్‌లో మార్పులు చేస్తూ ఐడెన్ మార్‌క్రమ్‌ అద్భుత కెప్టెన్సీ చేశాడు. కోచ్‌ రాబ్‌ జట్టులో మంచి వాతావరణం తీసుకొచ్చాడు. మా కోచ్ మైదానంలో మమల్ని బాగా కష్టపెట్టినా.. మా కుటుంబాలతో ఆనందించడానికి కూడా అనుమతిస్తాడు. దాని వల్ల కలిగే ప్రయోజనాలను మైదానంలో చూపిస్తున్నాం’ అని తంబ్రిజ్ షంసి పేర్కొన్నాడు.

Tabraiz Shamsi Shoe

Tabraiz Shamsi Shoe