Leading News Portal in Telugu

Virat Kohli: విరాట్ కోహ్లీ వెజిటేరియన్‌ కదా.. ‘చికెన్ టిక్కా’ తినడం ఏంటి?


Virat Kohli: విరాట్ కోహ్లీ వెజిటేరియన్‌ కదా.. ‘చికెన్ టిక్కా’ తినడం ఏంటి?

Virat Kohli Mock Chicken Tikka Post Confused to Fans: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ‘వెజిటేరియన్‌’ అన్న విషయం తెలిసిందే. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే విరాట్.. దాని కోసమే గతంలో వెజిటేరియన్‌గా మారాడు. వెన్నెముక సమస్య కూడా నాన్‌వెజ్‌ తినే కోహ్లీని వెజిటేరియన్‌గా మారేలా చేసింది. విదేశీ టూర్స్ వెళ్లినా కూడా కోహ్లీ ముక్క మాత్రం ముట్టుకోడు. అయితే తాజాగా ‘మాక్‌ చికెన్‌ టిక్కా’ తింటున్న ఫొటోను విరాట్ షేర్‌ చేయడంతో అందరూ గందరగోళానికి గురవుతున్నారు.

ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ.. సోషల్‌ మీడియా వేదికగా ఓ ఫొటో షేర్‌ చేశాడు. ‘ఈ మాక్‌ చికెన్‌ టిక్కాను మీరు తప్పక ఇష్టపడతారు’ అంటూ ఫొటోకి క్యాప్షన్‌ ఇచ్చాడు. దీంతో అభిమానులు తమ కామెంట్లకు పని చెప్పారు. కోహ్లీ వెజిటేరియన్‌ కదా.. ‘చికెన్ టిక్కా’ తినడం ఏంటి? అని కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. దీనిపై ఓ అభిమాని క్లారిటీ ఇచ్చాడు. ‘కొంతమందికి చికెన్‌ టిక్కాకు, మాక్‌ చికెన్‌ టిక్కాకు తేడా తెలియదు. మాక్‌ చికెన్‌ టిక్కా వెజిటేరియన్‌ ఫుడ్‌. ఇది ఓ మొక్క నుంచి తయారు చేసిన ఆహారం. అది తెలియని వారు కోహ్లీ నాన్‌వెజ్‌ తిన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు’ అని సమాధానం ఇచ్చాడు.

వాస్తవానికి మాక్‌ చికెన్ టిక్కా నాన్‌వెజ్‌ కాదు. దీన్ని చికెన్‌తో అస్సలు తయారు చేయరు. దీనిని తయారు చేయడానికి సోయాను వాడతారు. ఓరకంగా చెప్పాలంటే.. ఇది వెజిటేరియన్ల నాన్‌వెజ్ ఫుడ్. రుచి పరంగా చికెన్‌ టిక్కాకు, మాక్‌ చికెన్ టిక్కాకు పెద్దగా తేడా ఉండదు. అందుకే మాంసాహారం మాక్‌ వెర్షన్‌ను సోయాతోనే తయారు చేస్తారు. విరాట్ కోహ్లీ నాన్‌వెజ్‌ను మానేసిన తర్వాత సోయాతో తయారు చేసిన మాక్‌ చికెన్‌ను తింటుంటాడు. కోహ్లీ తినేది చికెన్ కాదు సోయా.