Leading News Portal in Telugu

Minister Amarnath: పవన్‌ అజ్ఞాత వాసి, నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి.. మంత్రి అమర్‌నాథ్ ఆగ్రహం


Minister Amarnath: పవన్‌ అజ్ఞాత వాసి, నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి.. మంత్రి అమర్‌నాథ్ ఆగ్రహం

Minister Amarnath: రాష్ట్రంను హోల్ సేల్‌గా అమ్మేయడం వైసీపీ ప్రారంభించిందన్న జనసేన పీఏసీ కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలపై మంత్రి అమర్‌నాథ్‌ తీవ్రంగా మండిపడ్డారు. జనసేనలో పొలిటికల్ బ్రోకర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ అధినేత అజ్ఞాత వాసి అయితే, ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ అజ్ఞాని అంటూ ఆగ్రహించారు. హిందూపురంలో అపెరల్ పార్క్, నెల్లూరులో పవర్ ప్రాజెక్ట్ భూములు వివాదంలో ఉంటే వైసీపీ ప్రభుత్వం పరిష్కరించిందని ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికీ ఏపీఐఐసీకి చెందిన 12వేల ఎకరాలు భూములు న్యాయ వివాదాల్లో ఉన్నాయన్నారు. సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి చేసే తప్పుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మరో నెలరోజుల్లో రామాయపట్టణం పోర్టుకు మొదటి వేసల్ రాబోతోందన్నారు. రేపు ఉత్తరాంధ్రలో సీఎం పర్యటించనున్నట్లు మంత్రి చెప్పారు. 750కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని వెల్లడించారు. పలాసలో కొత్త ఇండస్ట్రీయల్ పార్క్‌ను సీఎం ప్రారంభించనున్నారని చెప్పారు.

ఇంఛార్జుల మార్పుపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌ల కంటే ప్రజలు,లక్షల మంది కార్యకర్తలు ముఖ్యమని మొదటి నుంచి సీఎం స్పష్టంగానే చెప్పారన్నారు. సీఎం నిర్ణయానికి ఎవరు అతీతులు కాదు.. అమర్‌నాథ్‌కు బాగోలేదని భావిస్తే మార్చేస్తారన్నారు. భవిష్యత్తులో మరికొన్ని మార్పులు ఉంటాయన్నారు. ఎటువంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాల్సిందేనన్నారు. ముఖ్యమంత్రి టిక్కెట్ ఇవ్వకపోతే జెండా పట్టుకుని తిరుగుతాం తప్ప మరో ఆలోచన ఉండదన్నారు. కేఏ పాల్ పోటీ చేయగా లేనిది కాంగ్రెస్ పోటీ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వన్స్ మోర్ మా నినాదమని మంత్రి అమర్‌నాథ్ స్పష్టం చేశారు.