Leading News Portal in Telugu

Health Tips : రోజూ పాలల్లో దీన్ని కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో తెలుసా?


Health Tips :  రోజూ పాలల్లో దీన్ని కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది.. శరీరానికి కాలసిన పోషకాలను అందిస్తుంది.. చలికాలంలో పాలను తీసుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటు ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొంతమంది బాదం, ఖర్జూరం వేడి పాలతో కలిపి తింటుంటారు. మరికొందరు చిటికెడు పసుపు లేదా దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలుపుకుని తాగుతారు. పాలల్లో పంచదారకు బదులు తేనెను వేసుకొని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలల్లో తేనెను వేసుకొని తాగడం వల్ల రుచి పెరగడం మాత్రమే కాదు.. మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..తేనె కలిపిన పాలలో ప్రోటీన్, జింక్, విటమిన్ డి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పాలల్లో కాల్షియం, విటమిన్ డి బలమైన ఎముకలను నిర్మించడంలో దోహదపడుతుంది..

ఈ రెండింటిలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇది శక్తిని అందించడంలో సహాయపడుతుంది. చలికాలంలో జీర్ణకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే పాలల్లో తేనె కలుపుకుని తాగాలి. పాలల్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి తేనెలోని సూక్ష్మజీవులతో కలిసి జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తాయి.. దాంతో గ్యాస్ సమస్యలు తగ్గిపోవడం మాత్రమే కాదు, గుండె జబ్బులను తగ్గిస్తుంది.. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది..

అలాగే ఈ కాలంలో జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే తేనెతో పాలు కలుపుకుని తాగాలి.. ఈ పానీయంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ పదార్థాలు ఉంటాయి.. ఈరెండింటిని కలిపి రోజు తాగితే శరీరానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు..