Leading News Portal in Telugu

Samsung Galaxy A15: శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. లీకైన ఫీచర్స్, ధర?


Samsung Galaxy A15: శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. లీకైన ఫీచర్స్, ధర?

ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శాంసంగ్ అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో గేలాక్సీ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేయబోతుంది.. ఈ ఫోన్ ఇంకా లాంచ్ అవ్వక ముందే ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఇక్కడ గేలాక్సి A15 4G డిజైన్, రంగు ఎంపికలు, కొన్ని స్పెషిఫికేషన్లు వెల్లడయ్యాయి. గేలాక్సి A15 4Gలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

లీకైన సమాచారం ప్రకారం.. ఈ కొత్త మొబైల్స్ గతంలో వచ్చిన A14 ను పోలి ఉన్నట్లు తెలుస్తుంది.. మూడు వెనుక కెమెరాలు, LED ఫ్లాగ్ వెనుక భాగంలో కనిపిస్తాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ ఉంది. లీకైన ఫోటోలో, ఫోన్ మూడు రంగులలో (నలుపు, తెలుపు మరియు పసుపు) చూడవచ్చు.. ఇక ఈ ఫోన్ లోపల మీడియా టెక్ హీలియో G99 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. ఫోన్ ర్యామ్ , స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో రావొచ్చు. ఇందులో ఒక ఎంపిక 4 జిబి,128 జిబీ స్టోరేజ్‌తో ఉండనున్నట్లు తెలుస్తోంది. డిస్ప్లే గురించి మాట్లాడితే, దాని పరిమాణం 6.5-అంగుళాలు కావొచ్చు. కానీ రిజల్యూషన్ ఇంకా ఇవ్వలేదు..

ఇక కెమెరా విషయానికొస్తే.. ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 50MP ప్రైమరీ, 5MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు 13MP కెమెరా ఉంటుంది. ఇది కాకుండా, ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో బలమైన 5000 ఎంపిహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నట్లు తెలుస్తుంది.. అయితే దీన్ని మార్కెట్ లోకి ఎప్పుడు తీసుకొని వస్తారో తెలియలేదు.. అలాగే ధర గురించి కూడా కంపెనీ ఏమీ చెప్పలేదు.. ఫోన్ ను లాంచ్ చేసినప్పుడు దీని ధర గురించి చెప్తారేమో చూడాలి..