Leading News Portal in Telugu

కుటుంబంతో సహా కలెక్టర్  గన్ మెన్ ఆత్మహత్య


posted on Dec 15, 2023 11:44AM

సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్  నరేష్  ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. భార్య, ముగ్గురు  పిల్లల్ని  హత్య చేసి తాను గన్ తో కాల్చుకుని  ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం విధులకు హాజరు కాకపోవడంతో తోటి ఉద్యోగులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. గన్ మెన్ తో బాటు భార్య పిల్లలు ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. చిన్నకోడూరు మండలం రాముని పట్లలో ఘటన జరిగింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామ నివాసి ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద పీఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజులాగే విధులు పూర్తి చేసుకుని… ఇంటికి వచ్చే సమయంలో 9ఎంఎం పిస్టల్ తెచ్చుకున్నాడు.  అదే పిస్టల్ తో భార్య చైతన్య, కుమారుడు రేవంత్,ఇద్దరు చిన్న పిల్లలను కాల్చి హత్య చేశాడు. ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కారణం తెలియాల్సి ఉంది.