
ప్రముఖ ప్రభుత్వ బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం అనేక రకాల సేవలను అందిస్తుంది.. ఎన్నో పథకాలను అందిస్తుంది.. అయితే ఇప్పటివరకు ఆన్లైన్లో లేదా ఆఫీస్ వెళ్లి ఈ సేవలను పొందేవారు.. కానీ ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఈ సేవలను పొందవచ్చు.. ఈ వాట్సాప్ ను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది నిత్యం వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఈ వాట్సాప్ ఎన్నో సేవలను కూడా అందిస్తుంది..
ఈ వాట్సాప్ ఇప్పుడు ఎల్ఐసీ లో పలు సేవలను కూడా అందిస్తుంది.. ఎల్ఐసీ వెబ్ పోర్టల్లో తమ పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారులు ఈ సేవలను ఆస్వాదించడానికి అర్హులు. దీని ద్వారా పాలసీదారులు ప్రీమియం సమాచారం, యులిప్ ప్లాన్ స్టేట్ మెంట్ల వంటి అనేక రకాల ప్రయోజనాలను పొందేందుకు వాట్సాప్ సేవలను ఉపయోగించుకోవచ్చు.. ఈ సేవలను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సేవలను పొందడం కోసం ముందుగా ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్(www.licindia.in)లో తమ పాలసీలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి…
మీరు వాట్సాప్ సేవలను ప్రారంభించడానికి ఎల్ఐసీ అధికారిక వాట్సాప్ నంబర్ అయిన 8976862090ను ఫోన్ లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఆ నంబర్ ను వాట్సాప్ లో ఓపెన్ చేసి, చాట్ బాక్స్ లో హలో అని మెసేజ్ చేయాలి. మీకు అప్పుడు 11 ఆప్షన్లతో కూడిన రిప్లై వస్తుంది.
అప్పుడు మీకు అవసరమైన సేవను ఎంచుకోవడానికి, ఆ పదకొండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని, దానికి పక్కన ఉన్న నంబర్ తో రిప్లై ఇవ్వండి..
మీకు కావలసిన సమాచారం మొత్తం వాట్సాప్ లో రిప్లై వస్తుంది..
ప్రీమియం బకాయి, బోనస్ సమాచారం, పాలసీ స్థితి, లోన్ అర్హత కొటేషన్, లోన్ రీపేమెంట్ కొటేషన్,లోన్ వడ్డీ, చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించిన సర్టిఫికెట్, యులిప్ -యూనిట్ల స్టేట్మెంట్, ఎల్ఐసీ సేవల లింక్లు, ఆప్ట్ ఇన్/ఆప్ట్ అవుట్ సర్వీస్ లు లాంటి సేవల గురించి సమాచారాన్ని మీరు వాట్సాప్ లోనే పొందవచ్చు..