
Russia: రష్యాలో తక్కువ జననాల రేటు ఆ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. చివరకు అధ్యక్షుడు పుతిన్ కూడా రష్యా మహిళలని ఎక్కువ పిల్లల్ని కనాలని సూచించారు. ఇదిలా ఉంటే రష్యాలో దీర్ఘకాలికంగా ఉన్న సంప్రదాయాలు మారేలా కనిపిస్తు్న్నాయి. మహిళలకు అబార్షన్లు చేసుకునే దీర్ఘకాలిక హక్కు ప్రశ్నార్థకంగా మారుతోంది. రష్యాలో గత దశాబ్ధాలుగా చట్టపరమైన గర్భస్రావాలకు అనుమతి ఉంది.
అయితే గత కొంతకాలంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్లను పరిమితం చేస్తున్నారు. రష్యా అధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలు గర్భాన్ని తీసేయించుకునే విధానాలను తగ్గించేందుకు అక్కడి ఆరోగ్య అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే అబార్షన్ల వల్ల జనన రేటు పెరగదని, అయినా కూడా జనాభాను మెరుగుపరచడం తమ లక్ష్యం అని అధికారులు చెప్పారు. ఆర్థడాక్స్ చర్చి అధికారులు కూడా అబార్షన్లను అరికట్టాలని అధికారులను కోరుతున్నారు. దేశం యుద్ధంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇటువంటి చర్యలు సహజమని.. జార్జియాలోని ఉన్న రష్యన్ ఫెమినిస్ట్ కార్యకర్త లెడా గరీబా అన్నారు. ఆమె రష్యన్ మహిళలకు..‘‘ ఇంట్లో కూర్చొని, ఎక్కువ మంది సైనికులకు జన్మనివ్వండి’’ అంటూ సందేశం ఇచ్చింది.
ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. గర్భస్రావాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, అయితే గర్భాన్ని తీసేసుకోవడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ప్రస్తుతం రస్యాలో అబార్షన్ రేటు 1990తో పోలిస్తే దాదాపుగా 10 రెట్లకు పడిపోయిందని రష్యన్ డెమోగ్రాఫర్ విక్టోరియా సాకేవిచ్ తెలిపారు. 1990 నుంచి రష్యాలో జనాభా వేగంగా పడిపోతోంది. ఎక్కువ మంది పిల్లలను కనేందుకు రష్యన్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధమైంది.