Leading News Portal in Telugu

Health Tips : కరివేపాకును ఇలా వాడితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఆ సమస్యలు మాయం..


Health Tips : కరివేపాకును ఇలా వాడితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఆ సమస్యలు మాయం..

ఈరోజుల్లో మారిన ఆహారపు అలవాట్లు.. వాతావరణంలో మార్పుల వల్ల కొత్త కొత్త అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అందులో దీర్ఘ కాలిక వ్యాధులు బీపి షుగర్ లు ఎక్కువ.. ఇవి ఒక్కసారి వస్తే పోవడం చాలా కష్టం.. చాలా మంది ఇప్పుడు అధిక రక్త పోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బీపీ వల్ల ఎక్కువగా గుండెకు ఇబ్బంది అవుతుంది. ఈ బీపీ సమస్యను ట్యాబ్లెట్స్ తో కాకుండా నేచురల్ గా కరివేపాకుతో కూడా అదుపు చేయవచ్చు.. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

కరివేపాకు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని అందరికీ తెలుసు.. శరీరానికి అవసరం అయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారాల్లో ప్రతి రోజు వినియోగించడం వల్ల పలు రకాల దీర్ఘకాలిక సమస్యలను కంట్రోల్ లోకి తీసుకు రావచ్చు.. ఈ కరివేపాకులో పాలీ ఫెనాల్స్, ఫ్లేవ నాయిడ్స్ వంటివి అధిక మోతాదులో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గించు కోవచ్చు.. నరాల బలహీనత, బిపిని కంట్రోల్ చెయ్యొచ్చు.. అందుకే ఉదయం గుప్పెడు ఆకులను తినాలని నిపుణులు సూచిస్తున్నారు..

కరివేపాకులో పొటాషియం అధికంగా ఉంటుంది.. రోజూ కరివేపాకు రసాన్ని తాగితే తక్కువ సమయంలోనే రక్త పోటు కంట్రోల్ అవుతుంది. అలాగే సోడియం ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.. వాసోడైలేషన్ ను ప్రోత్సహించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.. దాంతో రక్త ప్రవాహాన్ని సాఫిగా జరిగేలా చేస్తుంది.. గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.. అలాగే జీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తుంది.. జుట్టు, చర్మ సమస్యలను పూర్తిగా తగ్గిస్తుంది..