Leading News Portal in Telugu

సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు దంపతులు


posted on Dec 21, 2023 4:38PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. మరియమాత ఆలయంలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో చంద్రబాబు, భువనేశ్వరి పాల్గొన్నారు. మేరీమాత ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు వర్ల రామయ్య, జవహర్‌, దేవినేని ఉమ, అశోక్‌ బాబు, కొల్లు రవీంద్ర, నాగుల్‌ మీరా స్వాగతం పలికారు. జైలు నుంచి వచ్చాక పలు పుణ్య క్షేత్రాలను చంద్రబాబు సందర్శించిన విషయం తెలిసిందే. గుణదల మేరీ మాత ఆలయం నుంచి చంద్రబాబు దంపతులు ఇంటికి బయలుదేరి వెళ్లారు అంతకు ముందు విశాఖ నుంచి ఆయన విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి మేరీమాత ఆలయానికి వెళ్లారు.