షర్మిలపై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్ | srireddy hot comments on sharmila| lokesh| christmas| gift| nara| family| ycp| cm| jagan
posted on Dec 26, 2023 10:41AM
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలపై శ్రీరెడ్డి ఎక్స్ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. నీకు ఆస్తి కన్నా ఆంధ్రా ప్రజల భవిష్యత్తు ముఖ్యం కాదు.. నువ్వు చెల్లివి కాదు.. రాకాసి శూర్పణఖవి. దేవుడిని అడ్డం పట్టుకొని ప్రజల సొమ్ముని చందాల రూపంలో అడుక్కుని తినే బతుకులు మీవి.. విదేశీ ఫండ్స్ దోచుకు తినే మీరు కూడా.. జగనన్నకి గోతులు తీసినంత మాత్రనా లేదా శాపాలు పెట్టినంత మాత్రానా ఏం ఓరగదు.. అవన్నీ తిరిగి మిమ్మల్నే సైతాన్లగా పీడిస్తాయి. పతివ్రత కట్టింగ్స్ వద్దులే. జాగ్రత్త అతి చేష్టలు ఒంటికి మంచిది కాదు. షర్మిలకు శ్రీరెడ్డి చురకలంటించింది. అయితే ఈ శ్రీరెడ్డి ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యపై నెటిజన్లు ఓ రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు.
డిసెంబర్ 24వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఫ్యాన్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల క్రిస్మస్ కానుక పంపారు. దీనిపై నారా లోకేశ్ ట్విట్ చేస్తూ.. షర్మిలకు కృతజ్జతలు తెలిపారు. షర్మిల.. తనకు పంపిన క్రిస్మస్ బహుమతులను ఎక్స్ వేదికగా నారా లోకేశ్ పోస్ట్ చేశారు. నారా కుటుంబం తరఫున ఆమెకు ఆయన క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.
అయితే షర్మిల.. ఇలా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి క్రిస్మస్ కానుకులు పంపి… శుభాకాంక్షలు తెలపడం.. జగన్ అబిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారికి అలవాటైన రీతిలో దూషణల పర్వానికి దిగారు. సీఎం జగన్ హార్ట్ కోర్ ఫ్యాన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ లాంటి శ్రీరెడ్డి అలాంటి దూషణల పర్వానికి శ్రీకారం చుట్టారు.
అయితే ఇటీవల అంటే ఈ ఏడాది నవంబర్ తొలి వారంలో ఇదే శ్రీరెడ్డి.. వైసీపీ కోసం సోషల్ మీడియాలో పని చేస్తున్న ఎవరికీ జీతాలు రావడం లేదని.. తామంతా చాలా ఇబ్బందులు పడుతున్నాం, సోషల్ మీడియా వింగ్‌ను పట్టించుకోండంటూ.. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌కు విన్నవించుకొంటున్న ఓ వీడియో సోషల్ మీడియలో వైరల్ అయిన సంగతి అందరకి తెలిసిందే. ఈ వీడియోతో శ్రీరెడ్డి జగన్ పై అభిమానంతో కాదు.. వైసీపీ నుంచి అందుతున్న ఫండింగ్ కోసమే ఆమె తన అసభ్య పరిభాషకు పదును పెట్టుకుని మరీ జగనన్న కోసం, వైసీపీ కోసం సోషల్ మీడియా వేదికగా పని చేస్తున్నదని తేటతెల్లమైందనీ, ఇప్పుడు షర్మిలపై ఆమె వ్యాఖ్యలకు కారణం.. సొమ్ములు అందడమేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. గత ఎన్నికల వేళే కాదు..అంతుకు ముందు సైతం ఇదే శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేసేదో అందరికీ తెలిసిందేననే కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
అలాగే రానున్న ఎన్నికల్లో మళ్లీ అదికారం చేపట్టేందుకు వైయస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని.. అలాంటి వేళ.. సొంత సోదరుడి రాజకీయ ప్రధాన ప్రత్యర్థి నారా ఫ్యామిలీకి వైయస్ షర్మిల ఇలా క్రిస్మస్ కానుకలు పంపడంతో.. ఫ్యాన్ పార్టీ అధినేత వర్గం తీవ్ర విస్మయం వ్యక్తం చేసిందని.. ఆ క్రమంలోనే శ్రీరెడ్డి వంటి వారు ఆగమేఘాల మీద రంగంలోకి దిగి రచ్చ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.