Leading News Portal in Telugu

Vivo Z100 Series: భారత్‌లో వివో ఎక్స్100 సిరీస్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్ ఇవే..


Vivo Z100 Series: భారత్‌లో వివో ఎక్స్100 సిరీస్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్ ఇవే..

ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ వివో నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానున్నారు.. వివో ఎక్స్100 సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది.. ఈ మొబైల్స్ జనవరి 4న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో రెండు మోడల్స్‌ను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది.. ఎక్స్ సిరీస్ డివైజ్‌ల మాదిరిగానే కెమెరా-ఫోకస్డ్ ఫోన్‌లు ఉంటాయి. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో డైమెన్సిటీ 9300, శక్తివంతమైన కెమెరా సెటప్‌తో వస్తాయి..

ఈ ఫోన్ల ఫీచర్స్ విషయానికొస్తే.. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో ఈ రెండు నవంబర్ నెలలోనే చైనాలో విడుదలయ్యాయి. తాజాగా భారత్‌తో పాటు అంతర్జాతీయంగా ఎంపిక చేసిన పలు దేశాల్లో ఈ ఫోన్లు మార్కెట్‌లోకి రాబోతున్నాయి.. 6.78-అంగుళాల స్క్రీన్‌తో వస్తాయి. 1260పీ రిజల్యూషన్‌లో ఆకర్షణీయమైన విజువల్స్‌ను అందిస్తాయి. ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను తక్కువ 1హెచ్‌జెడ్ నుంచి మృదువైన 120హెచ్‌జెడ్‌కి సర్దుబాటు చేయగలదు. తద్వారా గ్రేట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.. ఇక కెమెరా విషయానికొస్తే.. 32ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటాయి. ఈ ఫోన్‌లు దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68 రేట్ అయ్యాయి. ఆండ్రాయిడ్ 14ను వివో ఫన్‌టచ్ ఓఎస్ 14 ఇంటర్‌ఫేస్‌తో ఉపయోగిస్తున్నారు..

ఇకపోతే ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది.. ఇకపోతే 12జీబీ ర్యామ్‌తో 256జీబీ స్టోరేజ్ ఆప్షన్, 16జీబీ ర్యామ్‌తో 512జీబీ స్టోరేజ్ ఆప్షన్, వివో ఎక్స్100 ప్రో మోడల్ 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో వస్తుంది. ఈ మోడళ్ల ధర వివరాలు తర్వాత వెల్లడికానున్నాయి.. వివో ఎక్స్100 సిరీస్ రూ. 57,090 వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు…