Leading News Portal in Telugu

Viral Video: కూరగాయలు కొంటున్న శునకం.. ఎంత క్యూట్‌గా ఉందో..!


Viral Video: కూరగాయలు కొంటున్న శునకం.. ఎంత క్యూట్‌గా ఉందో..!

శునకాలు.. విశ్వానికి మారుపేరులా ఉంటాయి. ఒక్కసారి దానికి తిండి పెడితే ఆ వ్యక్తిని గుర్తు పెట్టుకుని ప్రేమ కురిపిస్తుంది. ఇక పెంపుడు కుక్కలకు అయితే యజమానితో ఉండే బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క క్షణంగా కూడా తన యజమానిని వదిలి ఉండలేవు. ఇక చాలా రోజుల తర్వాత కనిపిస్తే మాత్రం మీదకి ఎగబడుతూ ప్రేమను కురిపిస్తుంది. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో అవి చేసే పనులతో మనుషులు సర్‌ప్రైజ్ చేస్తుంది. అంతలా తెలివిని ప్రదర్శించి మనుషులను ఆశ్చర్యపరుస్తుంటాయి. అంతేకాదు అచ్చంగా మనుషుల్లాగే పనులు చేస్తూ యజమానికి హెల్ప్ చేస్తుంటాయి.

తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే నిజంగానే శునకాలకు ఇంత తెలివి ఉంటుందా? అనిపించకమానదు. ఇంతకీ ఆ శునకం చేసిన పని ఏంటి.? అంతలా ఆశ్చర్యపడే విషయం ఏంటో ఈ వీడియో చూడండి! శునకాలు తమ యజమానుల పట్ల నిబద్ధతతో ఉంటాయడంలో సందేహమే లేదు. యజమాని చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటిస్తాయి. అందుకే శునకాలను కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తుంటారు. ఇక కొన్ని దేశాల్లో కుక్కలు మనుషుల్లాగే అన్ని పనులు చేస్తుంటాయి. తాజాగా ఓ కుక్క యజమాని కోసం కూరగాయలు కొనడానికి మార్కెట్ వచ్చింది. సాధారణంగా ఇలాంటి దృశ్యాల్లో తరచూ మనం కోతులను చూస్తుంటాం. కానీ తాజాగా ఓ పెంపుడు శునకం కురగాయలు కొనడం అందరిని సర్‌ప్రైజ్ చేస్తోంది.

యజమానితో మార్కెట్ వచ్చిన కుక్క యజమాని చెప్పినట్టుగా చేసింది. కూరగాయలు విక్రయిస్తున్న ఓ మహిళ దగ్గరికి వెళ్లిన యజమానికి చెప్పిన వెజిటెబుల్స్ తీసుకుంది. ఆ మహిళ బాస్కెట్‌లో డబ్బులు తీసుకుని మిగిలిన చెంజ్ అదే బాస్కెట్‌లో పెట్టింది. అనంతరం తిరిగి బాస్కెట్‌ను నోట కరుచుకుని అక్కడి నుంచి యజమానికి ఇంటికి పరుగులు తీసింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. శునకం తెలివికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే అంటూ కామెట్స్‌ చేస్తున్నారు. ఇక మరికొందరైతే ఇలాంటి శునకాన్ని పెంచుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది అంటూ స్పందిస్తున్నారు.