Leading News Portal in Telugu

Lips Care : చలికి పెదవులు బాగా పగులుతున్నాయా? ఈ టిప్స్ మీకోసమే..


Lips Care : చలికి పెదవులు బాగా పగులుతున్నాయా? ఈ టిప్స్ మీకోసమే..

చలికాలం వచ్చిందంటే చాలు చర్మంతో పాటుగా పెదాలు కూడా పగులుతాయి.. పెదవుల నుంచి కొన్నిసార్లు రక్తం కూడా కారుతుంది.. చల్లటి గాలులు, పెదవులు పొడిబారడం, శరీరంలో నీటి శాతం తగ్గడం, విటమిన్ లోపం, తరుచూ పెదవులను నాలుకతో తడపడం వంటి వివిధ కారణాల వల్ల పెదవులు బాగా పగులుతుంటాయి.. అయితే మానవ శరీరంలో పెదవులు చాలా సున్నితమైన భాగం.. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి లిప్ బామ్ లను, లిప్ కేర్ లను వాడుతూ ఉంటారు. వీటితో పాటు కొన్ని ఇంటి చిట్కాలను వాడడం వల్ల కూడా పెదవులు పగలడం తగ్గుతుంది.. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పగిలిన పెదవులతో బాధపడే వారు కలబంద గుజ్జును వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెదవులపై కలబంద గుజ్జును రాసి అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటితో శుభ్రం చేయాలి.. ఇలా చెయ్యడం వల్ల పెదవులు అందంగా, మృదువుగా మారతాయి.. పెదవులకు వెన్న రాసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వెన్నలో పంచదార వేసి పెదవులపై నెమ్మదిగా రాస్తూ మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులపై ఉండే మృతకణాలు, పొరలు తొలగిపోవడంతో పాటు పెదవులు మృదువుగా తయారవుతాయి. అలాగే పెదవులు గులాబిరంగులో మెరుస్తూ ఉంటాయి..

తేనె కూడా పెదవులకు మంచిది.. రోజూ ఉదయం రాత్రి పెదాలకు రాసుకోవడం వల్ల మృదువుగా అందంగా మారతాయి.. పెదవుల పగుళ్లు తగ్గుతాయి. అలాగే పెదవులకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పెదవులకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల పెదవుల పగుళ్లు తగ్గుతాయి. పెదవులు పొడిబారకుండా ఉంటాయి. అలాగే పెదవులకు నువ్వుల నూనెను కూడా రాసుకోవచ్చు. వేళ్లతో నువ్వుల నూనెను తీసుకుని పెదవులపై రాసి మర్దనా చేసుకోవాలి..వాజిలిన్ ను తీసుకున్నా కూడా పెదవులు అందంగా, మృధువుగా మారతాయి.. రోజూ ఇలా చేసుకుంటే పెదవులు అందంగా మారతాయి..