Leading News Portal in Telugu

T20 World Cup 2024: భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్ అప్పుడేనా?


T20 World Cup 2024: భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్ అప్పుడేనా?

IND vs PAK Match in T20 World Cup 2024: ఈ ఏడాదిలో టీ20 ప్రపంచకప్‌ 2024 జరగనున్న విషయం తెలిసిందే. యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ వేదికలుగా జరిగే ఈ పొట్టి టోర్నీలో 20 జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. వన్డే ప్రపంచకప్‌ 2023లో తలపడ్డ దాయాదులు భారత్, పాకిస్థాన్‌ టీ20 ప్రపంచకప్‌లో మరోసారి తలపడనున్నాయి. పొట్టి టోర్నీ కోసం అధికారిక షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాకున్నా.. క్రికెట్‌ వర్గాల ప్రకారం ఇండో-పాక్ మ్యాచ్ జూన్ 9న జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


గ్రూప్‌ స్టేజ్‌లో భారత్ మ్యాచ్‌లు జూన్‌ 5 ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. గ్రూప్‌ స్టేజ్‌లో యూఎస్‌ఏ వేదికగానే భారత్ మ్యాచ్‌లు ఆడనుంది. ఒకవేళ భారత్ సూపర్ 8కు చేరుకుంటే.. జూన్ 20 నుంచి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. సూపర్ 8 స్టేజ్‌మ్యాచ్‌లు వెస్టిండీస్‌లోనే జరుగుతాయని సమాచారం. జూన్ 29న ఫైనల్‌ మ్యాచ్‌ బార్బడోస్‌ వేదికగా జరగనుందని సమాచారం. ఇక టీ20 ప్రపంచకప్‌లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఐపీఎల్‌ 2024 ప్రదర్శన ఆధారంగా భారత జట్టు ఎంపిక ఉంటుందని తెలుస్తోంది.

భారత్‌ గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు:
భారత్-ఐర్లాండ్‌ జూన్‌ 5 (న్యూయార్క్‌)
భారత్-పాకిస్థాన్‌ జూన్ 9 (న్యూయార్క్‌)
భారత్-యూఎస్‌ఏ జూన్ 12 (న్యూయార్క్‌)
భారత్-కెనడా జూన్ 15న (ఫ్లోరిడా)