
Icon of the Seas: మెగా క్రూయిజ్ షిప్, ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. రాయల్ కరేబియన్స్ షిప్స్ ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ ఈ నెల 27న తన ప్రారంభ యాత్రను మొదలుపెట్టనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా పేరు తెచ్చుకుంది. అంతకుముందు రాయల్ కరేబియన్ ‘వండర్ ఆఫ్ ది సీస్’ అతిపెద్ద నౌకగా ఉండగా.. ఇప్పుడు ఆ ఖ్యాతిని ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ దక్కించుకుంది.
పరిమాణం పరంగా చూస్తే టైటానిక్ ఓడ కన్నా ఇది 5 రెట్లు పెద్దది. దీని మొత్తం బరువు 2,50,800 గిగాటన్. 2 బిలియన్ డాలర్లతో ఈ నౌకను నిర్మించారు. రాయల్ కరేబియన్ క్రూయిల్ లైనర్లలో ఐకాన్ ఆఫ్ ది సీస్, ఈ లైనప్‌లో స్టార్ ఆఫ్ ది సీస్, ఒడిస్సీ ఆఫ్ ది సీస్, వండర్ ఆఫ్ ది సీస్ అనే నాలుగు పెద్ద క్రూయిజ్ షిప్‌లు ఉన్నాయి.
ఈ ఓడ 18 ప్యాసింజర్ డెక్‌లను కలిగి ఉంది. 5,160 మంది ప్రయాణికులతో పాటు 2,350 మంది సిబ్బందిని సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భారీ ఓడలో అతిపెద్ద స్విమ్మంగ్ పూల్‌తో సహా 7 పూల్స్‌ని కలిగి ఉంది. భారీ ఓడకు శక్తినిచ్చేందుకు లిక్విడ్ న్యాచురల్ గ్యాస్‌ని ఉపయోగించుకుంటుంది. రివర్స్ ఆస్మాసిస్/డీశాలినేషన్ ప్లాంట్ ద్వారా ఆన్‌బోర్డ్‌లో మంచినీటి అవసరాలను 90 శాతం తీరుస్తుంది.