
Weather: శీతాకాలంలో విపరీతమైన చలితో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే, నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లను చలి తీవ్రత వణికిస్తోంది. 25 ఏళ్ల తర్వాత స్వీడన్, ఫిన్లాండ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఎముకలు కొరికే చలికి తోడు దట్టమైన మంచు కురుస్తుండటంతో మూడు దేశాల్లోనూ రవాణా వ్యవస్థ పూర్తిగా స్థభించిపోయిందని పేర్కొన్నారు.
ఇక, స్వీడన్ లోని ఉత్తర ప్రాంతంలో అయితే, ఉష్ణోగ్రతలు 1999 తర్వాత –43.6 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడం ఇదే తొలి సారి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 1951లో తిరిగి 1999 లోనూ –49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వారు గుర్తు చేశారు. పొరుగునే ఉన్న ఫిన్లాండ్ దేశంలోని వైలివియెస్కాలో కూడా ఉష్ణోగ్రతలు మంగళవారం నాడు –37.8 డిగ్రీలుగా నమోదు అయినట్లు వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పుకొచ్చారు.