Leading News Portal in Telugu

Alaska Airlines: టేకాఫ్ అయిన వెంటనే విరిగిన విమానం డోర్.. తర్వాత ఏమైందంటే..?


Alaska Airlines: టేకాఫ్ అయిన వెంటనే విరిగిన విమానం డోర్.. తర్వాత ఏమైందంటే..?

అలాస్కా ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న బోయింగ్ కో. 737 మ్యాక్స్ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కిటికీతో పాటు విమానం ఫ్యూజ్‌లేజ్‌లో కొంత భాగం ఎగిరిపోవడంతో పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయబడింది. అయితే, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని ఎయిర్‌లైన్స్ తెలిపింది. అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణ సమయంలో 174 మంది అతిథులతో పాటు 6 మంది సిబ్బందితో పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.


ఈ రకమైన సంఘటన చాలా అరుదుగా జరుగుతాయని అలాస్కా ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ప్రమాదకరమైన పరిస్థితి సంభవించినప్పుడు ఫ్లైట్ ను ఎలా సురక్షితంగా ల్యాండ్ చేయాలనే దానిపై శిక్షణ ఇచ్చినట్లు పేర్కొనింది. దీంతో ఎగ్జిట్ డోర్ గాల్లో ఎగిరిపోవడాన్ని ప్రయాణీకులు వీడియో తీయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటనపై పూర్తి విచాణ చేస్తున్నామని అలాస్కా ఎయిర్ లైన్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.