Leading News Portal in Telugu

ఇలా చేరి అలా రాజీనామా.. వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై | ambati rayudu resign ycp| december| join| january| goodbye| jagan| image


posted on Jan 6, 2024 10:15AM

వైసీపీకి భవిష్యత్ లేదా? ఈ విషయం పార్టీలో దగాకు గురైన వారే కాదు.. నిన్న మొన్న వచ్చి చేరిన వారికి కూడా అర్ధమైపోతోందా? పరిశీలకులు ఔననే అంటున్నారు. తాజాగా నిన్న కాకమొన్న వైసీపీ కండువా కప్పుకుని జగన్ పై ప్రశంలస వర్షం కురిపించిన అంబటి రాయుడు పార్టీకి గుడ్ బై  చెప్పారు. వైసీపీ మునిగే నావలా ఉందనడానికి అంబటి రాయుడు చేరిన రోజుల వ్యవధిలోనే రాజీనామా చేయడం తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అంబటి రాయుడు క్లుప్తంగా తన ఎక్స్ వేదక ద్వారా వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నారని, త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాననీ వెల్లడించారు. గత నెల 28న ఆర్భాటంగా జగన్ సమక్షంలో వైసీపీలో చేరి ఆ పార్టీ కండువా కప్పుకున్న అంబటి రాయుడు అంతలోనే ఇలా తాత్కాలిక విరామం అంటూ వైసీపీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. అంబటి రాయుడు గుంటూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని పార్టీ వర్గాల అప్పట్లో చెప్పాయి. అంతలోనే ఆయన వైసీపీలో చేరిన పది రోజుల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేశారు.  

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గత కొంత కాలంగా వైసీపీపై, జగన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ వచ్చారు. అలాగే గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటనలు కూడా చేశారు. ఆయన వైసీపీ గూటికి చేరి గుంటూరు లోక్ సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. అందుకు అనుగుణంగానే అంబటి గత ఏడాది డిసెంబర్ 28న జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అంతలో ఏమైందో ఏమో పార్టీకి రాజీనామా చేశారు.

కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. గుంటూరు నుంచి వైసీపీ టికెట్ లభించే అవకాశం లేదని జగన్ స్పష్టం చేయడంతోనే అంబటి ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న అనుమానాలను పరిశీలకుల  వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా చేరి అలా రాజీనామా చేయడం వల్ల అంబటి రాయుడుకి వచ్చిన నష్టం ఏమీ ఉండదు కానీ, వైసీపీకి, జగన్ ఇమేజ్ కి ఈ పరిణామం భారీ నష్టం చేస్తుందనడంలో సందేహం లేదు.