Leading News Portal in Telugu

Flipkart Sale 2024: ఫ్లిప్‌కార్ట్‌లో ‘రిపబ్లిక్‌ డే’ సేల్‌.. ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు!


Flipkart Sale 2024: ఫ్లిప్‌కార్ట్‌లో ‘రిపబ్లిక్‌ డే’ సేల్‌.. ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు!

Flipkart Republic Day Sale 2024 Dates Announced; ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్‌’ మరో సేల్‌ను ఆరంభించేందుకు సిద్ధమైంది. ‘రిపబ్లిక్‌ డే’ సేల్‌ జనవరి 14 నుంచి 19 వరకు కొనసాగుతుంది. ఇందుకుసంబందించి ఫ్లిప్‌కార్ట్‌ తమ వెబ్‌సైట్‌లో బ్యానర్‌లను పోస్ట్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు మాత్రం ఒక రోజు ముందుగానే (జనవరి 13 అర్ధరాత్రి) రిపబ్లిక్‌ డే సేల్‌ అందుబాటులోకి రానుంది. ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌ అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్స్ అందించనుంది. ముఖ్యంగా ఫోన్‌లపై రాయితీలు, ఆఫర్లు భారీగా ఉండనున్నాయి.


ఐఫోన్ 15, ఐఫోన్ 14, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ 5జీ, శాంసంగ్ ఎఫ్‌14 5జీ, మోటోరొలా ఎడ్జ్‌ 40 నియో, మోటో జీ54 5జీ, గూగుల్‌ పిక్సెల్‌ 7ఎ, రియల్‌మీ 11 ఎక్స్‌ 5జీ, రియల్‌మీ సీ 53, వివో టీ2 ప్రో, ఒప్పో రెనో 10, పోకో ఎక్స్5, రెడ్ మీ 12 సహా మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు భారీగా ఉండనుంది. కొత్తగా రిలీజ్ కానున్న ఫోన్లపై కూడా రాయితీ అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఐఫోన్ 15 ధర ఇప్పటికే రూ. 79900 నుండి రూ. 72999కి తగ్గింది. రిపబ్లిక్‌ డే సేల్‌లో మరింత తగ్గే అవకాశం ఉంది.

రిపబ్లిక్‌ డే సేల్‌లో ఫ్యాషన్‌, యాక్సెసరీస్‌పై 50 నుంచి 80 శాతం డిస్కౌంట్స్ పొందవచ్చు. అప్లయెన్సస్‌పై 75 శాతం వరకు.. బ్యూటీ, ఫుడ్‌, టాయ్స్‌పై 85 శాతం వరకు.. పర్నిచర్‌లపై 80 శాతం వరకు డిస్కౌంట్స్ పొందొచ్చు. అయితే క్రెడిట్‌ కార్డు డిస్కౌంట్‌ ఆఫర్‌ ఏయే బ్యాంకు కార్డులపై ఉందో ఫ్లిప్‌కార్ట్‌ ఇంకా వెల్లడించలేదు. త్వరలో అన్ని వివరాలు తెలియరానున్నాయి.