
Shaheen Shah Afridi Takes Wicket as Pakistan Captain: ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది పాకిస్తాన్ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో పేలవమైన ప్రదర్శన తర్వాత బాబర్ ఆజామ్‌పై వేటు పడిన విషయం తెలిసిందే. దాంతో టీ20లో జట్టు పగ్గాలు షాహీన్ అందుకున్నాడు. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
పాకిస్తాన్ కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ ఆడుతున్న షాహీన్ అఫ్రిదికి సోషల్ మీడియాలో విషెష్ చెబుతున్నారు ఫాన్స్. ఈ మ్యాచ్ పాక్ గెలవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ ఆడుతున్న షాహీన్.. సారథిగా తొలి వికెట్ పడగొట్టాడు. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వేను ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్ చేశాడు. 23 ఏళ్ల షాహీన్ అఫ్రిది 2018లో పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 29 టెస్టులు, 53 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. షాహీన్ వరుసగా 113, 104, 64 వికెట్స్ పడగొట్టాడు.
మొదటి టీ20లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 10 ఓవర్లకు రెండు వికెట్స్ నష్టానికి 99 రన్స్ చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్ (40), డారిల్ మిచెల్ (20) రన్స్ చేశారు. ఓపెనర్ ఫిన్ అలెన్ 15 బంతుల్లో 34 రన్స్ చేశాడు. ఇక ఇరుజట్ల మధ్య జనవరి 14న హామిల్టన్‌లో రెండో టీ20, 17వ తేదీన ఓవల్‌లో మూడో టీ20, హెగ్లే ఓవల్‌లో 19న నాలుగో టీ20, జనవరి 21న హెగ్గే ఓవల్లో ఆఖరి టీ20 జరుగనుంది.